చిచ్చురేపిన ఆస్తి వివాదం!

ABN , First Publish Date - 2021-06-15T05:19:56+05:30 IST

ఆస్తి వివాదాలు రక్త సంబంధీకుల మధ్య చిచ్చురేపుతు న్నాయి. పార్వతీశంపేటలో ఆదివారం రాత్రి సమీప బంధువులు కొట్లాటకు దిగారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆస్తుల ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబం ధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పిడుగు మోహనరావు, నాగం చిన్నారావులు సమీప బంధువులు. ఆస్తి పంపకాల నేపథ్యంలో కొద్దిరోజుల కిందట నుంచి వీరి మధ్య వివాదం నడుస్తోంది. ఆదివారం మోహనరావు బావమరిది లెంక రేరాజు, చిన్నారావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగ డంతో కొట్లాటకు దిగారు. విషయం తెలుసుకున్న చిన్నారావు అనుచురులు బొంగు ప్రసాదరావుతో పాటు మరికొంతమంది అక్కడకు చేరుకున్నారు. పిడుగు మోహన రావు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంటి బయట ఉన్న కార్లతో పాటు కొన్ని వస్తువులు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపారు.

చిచ్చురేపిన ఆస్తి వివాదం!
దాడిలో ధ్వంసమైన కార్లు



 పార్వతీశంపేటలో సమీప బంధువుల మధ్య కొట్లాట

 వాహనాలు, వస్తువులు ధ్వంసం

ఆమదాలవలస: ఆస్తి వివాదాలు రక్త సంబంధీకుల మధ్య చిచ్చురేపుతు న్నాయి. పార్వతీశంపేటలో ఆదివారం రాత్రి సమీప బంధువులు కొట్లాటకు దిగారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆస్తుల ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబం ధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పిడుగు మోహనరావు, నాగం చిన్నారావులు సమీప బంధువులు. ఆస్తి పంపకాల నేపథ్యంలో కొద్దిరోజుల కిందట నుంచి వీరి మధ్య వివాదం నడుస్తోంది. ఆదివారం మోహనరావు బావమరిది లెంక రేరాజు, చిన్నారావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగ డంతో కొట్లాటకు దిగారు. విషయం తెలుసుకున్న చిన్నారావు అనుచురులు బొంగు ప్రసాదరావుతో పాటు మరికొంతమంది అక్కడకు చేరుకున్నారు. పిడుగు మోహన రావు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇంటి బయట ఉన్న కార్లతో పాటు కొన్ని వస్తువులు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపారు. 





Updated Date - 2021-06-15T05:19:56+05:30 IST