Abn logo
Oct 22 2021 @ 23:56PM

అధికారుల పనితీరుపై అసంతృప్తి

మాట్లాడుతున్న పశుసంవర్ధకశాఖ డైరక్టర్‌ అమరేంద్ర కుమార్‌

సీఎం జిల్లాలో ఇలాగైతే ఎలా... సాకులు చెప్పకుండా పనిచేయండి

విధులకు హాజరు కాని గోపాల మిత్రలను తొలగించండి

సమీక్ష సమావేశంలో పశుసంవర్ధకశాఖ డైరక్టర్‌ అమరేంద్రకుమార్‌


కడప(రూరల్‌), అక్టోబరు 22: జిల్లా పశుసంవర్ధకశాఖలో పనిచేసే కొందరు అధికారులు, డాక్టర్ల పనితీరుపై ఆ శాఖ డైరక్టర్‌ అమరేంద్ర కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జిల్లాలోనే ఇలా ఉంటే ఎలా.... సాకులు చెప్పకుండా బాధ్యతగా పనిచేయాలంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. జిల్లా ప్రజాపరిషత్‌ సమావేశ మం దిరంలో శుక్రవారం అభివృద్ధి పథకాలపై జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులతో సమీ క్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పశువుల టీకాల నమోదులో కడప జిల్లా చాలా వెనుకబడి ఉందన్నారు. కొందరు అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణమన్నారు. పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో టీకాల నమోదు జీరో శాతంలో ఉండడం మీ పనితీరు ఏ విధంగా ఉందో తెలుస్తోందన్నారు. ఇకనుంచైనా బాధ్యతగా పనిచేసి పశువులకు, గొర్రెలకు వందశాతం టీకాలు తప్పకుండా వేయించి లక్ష్యసాధనకు పాటుపడాలన్నారు. అలాగే అర్‌బీకే కేంద్రాలలో విధులకు హాజరుకాని గోపాల మిత్రలకు 3 రోజుల్లోపు విధులకు హాజరు కావాలని నోటీసులు జారీచేయయాలని, అప్పటికీ హాజరు కాకపోతే విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల పనితీరు మరింతగా మెరుగు పడాలన్నారు.  కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు వీఎల్‌ సత్యప్రకాష్‌, డీడీ హేమంత్‌కుమార్‌, ఆయా డివిజన్ల ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.