జిల్లా వ్యాప్తంగా గోదాముల నిర్మాణం

ABN , First Publish Date - 2021-09-17T05:08:50+05:30 IST

జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గోదాములను నిర్మిస్తామని ఆ సొసైటీ చైర్మన్‌ వీరి చలపతిరావు పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా గోదాముల నిర్మాణం
మహాజన సభలో మాట్లాడుతున్న వీరి చలపతి

డీసీఎంఎస్‌ మహాజన సభలో చైర్మన్‌ చలపతిరావు

నెల్లూరు(హరనాథపురం), సెప్టెంబరు 16 : జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గోదాములను నిర్మిస్తామని ఆ సొసైటీ చైర్మన్‌ వీరి చలపతిరావు పేర్కొన్నారు. గురువారం డీసీఎంఎస్‌ కార్యాలయంలో మహాజనసభ జరిగింది. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే నెల్లూరు జిల్లాలో గోదాములు తక్కువగా ఉన్నాయన్నారు. రైతుల అవసరాల దృష్ట్యా గోదాము ల ఆవశ్యకతను గుర్తించామని చెప్పారు. రైతుల సేవలో భాగంగా ఇప్పటికే ఎరువుల అమ్మకాలు జరుపుతున్నామని, రైతు డిపోలను ఏర్పాటు చేశామన్నారు. నవాబుపేట లో శిథిలావస్థలో ఉన్న రైస్‌ మిల్లు స్థానంలో షాపింగ్‌ కాంప్లెక్సు నిర్మిస్తామన్నారు. డీసీఎంఎస్‌ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అందిస్తామని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వ వైద్యశాలలకు మందులను, శానిటరీ ఐటమ్స్‌ను సరఫరా చేయటం ద్వారా డీసీఎంఎస్‌ను లాభాల బాటలో నిలుపుతామని చెప్పారు. ఈ సమా వేశంలో డీసీసీబీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, జిల్లా కోఆపరేటివ్‌ అధికారి కే తిరుపాల్‌రెడ్డి, డీసీఎంఎస్‌ బిజినెస్‌ మేనేజర్‌ డీ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T05:08:50+05:30 IST