పేదలకు దుస్తులు పంపిణీ

ABN , First Publish Date - 2022-01-17T05:07:53+05:30 IST

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా పరిషత్‌ ఆకేపాటి అమర్‌నాధరెడ్డి, వారి సోదరుడు ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆకేపాడు చుట్టుపక్కల గ్రామస్తులకు చీరలు పంపిణీ చేశారు.

పేదలకు దుస్తులు పంపిణీ
మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న జడ్పీ చైర్మన్‌ అమర్‌నాధరెడ్డి

రాజంపేట, జనవరి 16: సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా పరిషత్‌ ఆకేపాటి అమర్‌నాధరెడ్డి, వారి సోదరుడు ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆకేపాడు చుట్టుపక్కల గ్రామస్తులకు చీరలు పంపిణీ చేశారు. సుమారు 3వేల మంది మహిళలకు చీరలు అందజేశా రు. ఈ సందర్భంగా ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఎన్‌ఆర్‌ఐ ఆధ్వర్యంలో.... : తాళ్లపాక గ్రామంలో ఎన్‌ఆర్‌ఐ కేకే రెడ్డి కుటుంబీకుల ఆధ్వర్యంలో ఆదివారం మహిళలకు చీరలు, పురుషులకు పంచెలు, టవళ్లు అందజేశారు. సుమారు 100 కుటుంబాలకు ఈ దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాళ్లపాక సర్పంచ్‌ గౌరీశంకర్‌, ఎన్‌ఆర్‌ఐ కేకే రెడ్డి కుటుంబీకులు కారంపల్లె సుబ్బారెడ్డి, సుబోద్‌రెడ్డి, శివరామిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-17T05:07:53+05:30 IST