సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

ABN , First Publish Date - 2021-06-14T05:12:23+05:30 IST

రాజంపేట నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పేదలు అనేక వ్యాధులకు గురై చికిత్స చేయించుకున్న వారికి ఆర్థిక సహాయ నిమిత్తం చెక్కులను మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అందజేశారు.

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

రాజంపేట, జూన్‌13 : రాజంపేట నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పేదలు అనేక వ్యాధులకు గురై చికిత్స చేయించుకున్న వారికి ఆర్థిక సహాయ నిమిత్తం  చెక్కులను మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అందజేశారు. రాజంపేట మండలం ఆకేపాడులోని వారి స్వగృహంలో ఈ చెక్కులు అందజేశారు. సుండుపల్లె మండలం జి.రెడ్డివారిపల్లెకు చెందిన రితీ్‌షరెడ్డికి 5.75లక్షలు, రాజంపేట మండలం ఆకేపాడు కట్టకిందపల్లె ముమ్మడి ఆంజనేయులురెడ్డికి 50వేలు, రాజంపేట పట్టణం టి.కృష్ణమూర్తికి 70వేలు, ఒంటిమిట్ట మండలం చెర్లోపల్లెకు చెందిన చెన్నూరు వెంకటసుబ్బయ్యకు 2లక్షలు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లె మండల నాయకులు అజయ్‌రెడ్డి, పోలి మురళిమోహన్‌రెడ్డి, దాసరి పెంచలయ్య, బిళ్ల సురేష్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-14T05:12:23+05:30 IST