కొవిడ్‌ బాధితులకు డ్రైఫ్రూట్స్‌ పంపిణీ

ABN , First Publish Date - 2021-05-08T04:47:50+05:30 IST

కొవిడ్‌ బాధితులకు, వైద్యసిబ్బందికి ఎంఎల్‌ఏ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పంపిన డ్రైఫ్రూట్స్‌, నిమ్మకాయలను శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు టి. శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

కొవిడ్‌ బాధితులకు డ్రైఫ్రూట్స్‌ పంపిణీ
వైద్య సిబ్బందికి డ్రైఫ్రూట్స్‌ అందజేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

అడ్డాకుల, మే 7 : కొవిడ్‌ బాధితులకు, వైద్యసిబ్బందికి ఎంఎల్‌ఏ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పంపిన డ్రైఫ్రూట్స్‌, నిమ్మకాయలను శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు టి. శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మండల కోఆప్షన్‌ ఖాజాఘోరి, సర్పంచులు శ్రీకాంత్‌, కిషన్‌, ఎంపీటీసీ చంద్రయ్య, సింగిల్‌విండో డైరెక్టర్‌ కృష్ణ, చంద్రమో హన్‌రెడ్డి, రమేశ్‌గౌడ్‌, చక్రధర్‌రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు సుజాత, టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్‌, విజయ్‌కుమార్‌రెడ్డి, భీంరెడ్డి, దేవేందర్‌రెడ్డి, బొడ్డు రమేశ్‌, మహేశ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-08T04:47:50+05:30 IST