నిస్వార్థ సేవ

ABN , First Publish Date - 2020-06-05T11:06:12+05:30 IST

జిల్లాలో లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతలు సాయం చేశారు.

నిస్వార్థ సేవ

నిత్యావసర సరుకుల పంపిణీ 

పోలీసులకు రక్షణ కిట్ల అందజేత


ఆంధ్రజ్యోతి (న్యూస్‌ నెట్‌వర్క్‌), జూన్‌ 4: జిల్లాలో లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు దాతలు సాయం చేశారు. గురువారం నిత్యావసర సరుకులు అందించారు. పలువురు దాతలు పోలీసులకు రక్షణ కిట్లను అందించారు.


కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రజల శ్రేయస్సు కోసం రెడ్‌జోన్‌ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, హోంగార్డుల సేవలు అభినందనీయమని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం ఎస్పీ ఫక్కీరప్ప, వైసీపీ కర్నూలు పార్లమెంటరీ అధ్యక్షుడు బీవై రామయ్య చేతుల మీదుగా 400 మంది హోంగార్డులకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కరోనా సమయంలో 35 వేల నిత్యావసర కిట్లను పంపిణీ చేశారన్నారు.


అనేక మంది దాతలు మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లును పోలీసులకు సాయం చేశారన్నారు. విశిష్ట సేవలందించిన దాతలను అభినందించి త్వరలో అందరినీ సన్మానిస్తామని తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డ్స్‌ కమాండెంట్‌ (నాన్‌ కేడర్‌ ఎస్పీ) యు.రామ్మోహన్‌, ఓఎస్డీ ఆంజనేయులు, ఆర్‌ఐ శివారెడ్డి, హోంగార్డు అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయరత్నం, హోంగార్డు సభ్యులు నాగవేణి, ఉమామహేశ్వరరావు, సురేష్‌ పాల్గొన్నారు. 


 కోవిడ్‌ కట్టడిలో భాగంగా అహర్నిశలు కష్టపడుతున్న పోలీసులకు చేయూతనందించేందుకు ఫడల సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ అధినేత మురళీకృష్ణ ఆద్వర్యంలో పలు రకాలైన రక్షణా పరికరాలు గురువారం ఎస్పీ ఫక్కీరప్ప చేతుల మీదుగా పంపిణీ చేశారు. 100 ఎంఎల్‌ కలిగిన 5 వేలు శానిటైజర్లను, 5వేలు మాస్కులు, 117 థర్మల్‌ స్కానర్స్‌ (జ్వరం టెస్టింగ్‌), శానిటైజర్‌ స్టాండ్లు కలిగిన 500 ఎంఎల్‌ శానిటైజెర్‌ జెల్స్‌-117, ఫాగ్‌ 117 స్ర్పే మిషన్లు (ఒక్కో పోలీ్‌సస్టేషన్‌)కు, 117 శానిటైజర్లు (5 లీటర్లు), కేఎన్‌-95 మాస్కులు 200, నానో స్ర్పేయర్స్‌ 200 అందించారు.


మురళీకృష్ణ మాట్లాడుతూ కరోనా విధుల్లో పోలీసులు చేస్తున్న కృషిని అభినందించారు. ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీ్‌సస్టేషన్లకు ఈ రక్షణ పరికరాలను అందజేసే విదంగా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఫ్యాక్షన్‌ జోన్‌ సీఐ వెంకటరమణ, డీఐజీ ఆఫీస్‌ లైజనింగ్‌ ఆఫీసర్‌ ఎస్‌ఐ సునీల్‌, ఎస్పీ పీఏ నాగరాజు ఉన్నారు.


కర్నూలు నగరంలోని రైల్వేస్టేషన్‌,ఆర్టీసీ బస్టాండ్‌, ఆర్‌ఎ్‌సరోడ్డు తదితర ప్రాంతాల్లో ఉన్న నిరాశ్రయులకు రాయలసీమ మహిళా సంఘ్‌ అధ్యక్షురాలు గోరంట్ల శకుంతల అల్పాహారాన్ని అందజేశారు. 


కర్నూలు నగరంలోని 2వ వార్డులో దాత టీఎండీ ఫిరోజు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గురువారం సుబేదార్‌వీది, అర్బన్‌ బ్యాంక్‌, ప్రాంతాలలో అందించారు. 


నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.22 లక్షలు అందజేశారు. గురువారం విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి నంద్యాల నియోజక వర్గం తరపున రూ.22 లక్షల మొత్తానికి సంబంధించి చెక్కులను అందజేశారు. 


 నంద్యాల ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ సిబ్బంది ప్రభుత్వ జిల్లా వైద్యశాల వైద్యులకు పీపీఈ కిట్లను అందజేశారు. ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌కు రూ.2 లక్షల విలువ చేసే పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్క్‌లు, ఆరోగ్య పరికరాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ రీజనల్‌ మేనేజర్‌ రాజు, ప్రసాద్‌, చీప్‌ మేనేజర్లు, బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.


కొత్తపల్లి మండలంలోని జానాల, బలపాల తిప్ప, సిద్ధేశ్వరం చెంచులకు స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆర్థర్‌ తనయుడు వివేక్‌సందీప్‌ మేము సైతం ద్వారా 150 కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. నాయకులు పురుషోత్తం రెడ్డి, ముడియాల శ్రీనివాసరెడ్డి , జీఎండీ రఫి, సాయిరాం, గంగాధర్‌, శివారెడ్డి, చింతమాను రాజు, దాసు బొల్లు శీను తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-06-05T11:06:12+05:30 IST