Abn logo
May 28 2020 @ 04:10AM

చేతివృత్తిదారులకు నిత్యావసరాల పంపిణీ

వేంసూరు, మే 27: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ఫొటోగ్రాఫర్లు, రజకులకు దాతల సహకారంతో సమకూర్చిన నిత్యావసరాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, దాత ప్రభాకర్‌రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా దృష్ట్యా లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ పేదలను ఆదుకొనేందుకు పలువురు దాతలు ముందుకురావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వీరేశం, దాతలు ప్రభాకర్‌రెడ్డి, లింగారెడ్డి, ఎంపీపీ చౌట్ల వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్‌ గొర్ల సంజీవరెడ్డి, వెల్ది జగన్మోహన్‌రావు, సర్పంచ్‌ ఫైజుద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement