నారాయణఖేడ్‌లో ఆర్థికసాయం చెక్కుల పంపిణీ
ABN , First Publish Date - 2021-08-03T04:45:52+05:30 IST
ఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వివిధ పథకాల ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను లబ్ధిదారులకు సోమవారం అందజేశారు.
నారాయణఖేడ్, ఆగస్టు 2: ఖేడ్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వివిధ పథకాల ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. మండల పరిధిలోని జూజాల్‌పూర్‌కు చెందిన జెగితే మల్లమ్మకు రైతు బీమా ద్వారా మంజూరైన రూ.5లక్షల చెక్కును అందజేశారు. చాప్టా.కె గ్రామానికి చెందిన నలుగురికి, కంగ్టి మండలం ఎడ్లరేగడి తండాకు చెందిన ముగ్గురికి, చాప్టా.బి గ్రామానికి చెందిన ఇరువురికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జూజాల్‌పూర్ సర్పంచు జైపాల్‌రెడ్డి, విజిలెన్స్ కమిటీ సభ్యులు చెన్ బసప్ప, మాజీ సర్పంచులు సిద్దయ్య స్వామి , జగ్గప్ప, నాయకులు సంగప్ప ఉన్నారు.