ఫాగింగ్‌ యంత్రాల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-21T04:36:57+05:30 IST

దోమల బెడద నివారించడానికి మండలంలోని 10 పంచాయతీలకు ఫాగింగ్‌ యంత్రాలు మంజూరయ్యాయి.

ఫాగింగ్‌ యంత్రాల పంపిణీ
జుత్తాడ సర్పంచ్‌ నాగమణికి ఫాగింగ్‌ యంత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

పెందుర్తి, జనవరి 20: దోమల బెడద నివారించడానికి మండలంలోని 10 పంచాయతీలకు ఫాగింగ్‌ యంత్రాలు మంజూరయ్యాయి. దీనిలో భాగంగా గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వాలిమెరక జుత్తాడ సర్పంచ్‌ దువ్వి నాగమణికి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఫాగింగ్‌ యంత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంజులవాణి, ఎంపీపీ మదుపాడ నాగమణి, జడ్పీటీసీ ఉప్పిలి దేవి, మార్కెట్‌  కమిటీ చైర్మన్‌ కోడిగుడ్ల దేవిసాంబ, పీఏసీఎస్‌ చైర్మన్‌ గొర్లె రామునాయుడు తదితరులు పాల్గొన్నారు,



Updated Date - 2022-01-21T04:36:57+05:30 IST