రోగులకు పండ్లు పంపిణీ

ABN , First Publish Date - 2022-08-20T04:41:16+05:30 IST

వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం నారాయణపేట అనాథ ఆశ్రమంలోని పిల్లలతో కలిసి కలెక్టర్‌ హరిచందన సహపంక్తి భోజనం చేశారు.

రోగులకు పండ్లు పంపిణీ
పేట అనాథ ఆశ్రమంలో భోజనం చేస్తున్న కలెక్టర్‌ హరిచందన

- అనాథ పిల్లలతో సహ పంక్తి భోజనం చేసిన కలెక్టర్‌ హరిచందన

నారాయణపేట టౌన్‌, ఆగస్టు 19 : వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం నారాయణపేట అనాథ ఆశ్రమంలోని పిల్లలతో కలిసి కలెక్టర్‌ హరిచందన సహపంక్తి భోజనం చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విద్యార్థులు గోపిక శ్రీకృష్ణుడు యశోద వేషాధారణలతో ఉండడంతో వారికి జన్మాష్ఠమి శుభాకాంక్షలు తెలిపారు. వెన్న తయారు చేసే అలంకరణను చూసి వారిని అభినందించి కలిసి భో జనం చేశారు. అంతకుముందు చిన్నపిల్లల ఆసుపత్రికి చేరుకున్న కలెక్టర్‌ గర్భిణులకు పండ్లను పంపిణీ చేసి డయాలసిస్‌ సెంటర్‌ పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ పద్మజ రాణి, ఆర్డీవో రాంచం దర్‌, జిల్లా అధికారులు హతీరాం, శివప్రసాద్‌, వేణుగోపాల్‌, కమిషనర్‌ సునీత, పుర చైర్‌ పర్సన్‌ గందె అనసూయ, వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, కౌన్సిలర్లు ఉన్నారు.

నారాయణపేట రూరల్‌ : మండలంలోని కోటకొండ పీహెచ్‌సీలో వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ స భ్యురాలు అంజలి, సర్పంచ్‌ విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాములు, రైతుసమితి మండలాధ్యక్షుడు వెంకట్రాములుగౌడ్‌, ఎంపీడీవో సందీప్‌కుమార్‌, ఏపీవో జయమ్మ, పీహెచ్‌సీ డాక్టర్‌ వెంకట్‌దాదన్‌, గోవింద్‌రావు పాల్గొన్నారు.

మక్తల్‌ రూరల్‌ : వజ్రోత్సవాల్లో సందర్భంగా మక్తల్‌ మండలం కర్నీ పీహెచ్‌సీలో రోగులకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి శుక్రవారం పండ్లు పంపిణీ చేశారు. ఎంపీపీ వనజ, ఎంపీడీవో శ్రీధర్‌, సర్పంచు అక్రం, ఎంపీటీసీ సభ్యుడు చిన్న రంగప్ప, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కృష్ణ : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు కున్సీ గ్రామాల్లో రోగులకు, వృద్ధులకు ఎంపీడీవో శ్రీనివాస్‌ శుక్రవారం పండ్లు పంపిణీ చేశారు. సర్పంచు శంకరమ్మ, ఎంపీటీసీ సభ్యుడు రామచంద్ర, నాయకులు ఆంజనేయగౌడ్‌, ఏఎన్‌ఎం అలీవేలమ్మ, అంగన్‌వాడీ టీచర్లు అంజనమ్మ, పంచాయతీ కార్యదర్శి రాములు పాల్గొన్నారు. 

మాగనూరు : వజ్రోత్సవాల్లో భాగంగా మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఎంపీపీ శ్యామలమ్మ, జడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్య, సర్పంచు రాజు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వజ్రోత్సవంలో భాగంగా ఆసుపత్రిలో రో గులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆర్‌ఐ శ్రీశైలం, జూనియర్‌ అసిస్టెంట్‌ రామ కృష్ణ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ధన్వాడ : వజ్రత్సోవాల సందర్భంగా ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం రోగులకు ఎంపీపీ పద్మిబాయి, ఎంపీటీసీ సభ్యుడు గోవర్ధన్‌గౌడ్‌, ఎంపీడీవో సద్గుణ పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

ఊట్కూర్‌  :  మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సర్పంచ్‌ సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపీడీవో కాళప్ప పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 22వరకు వజ్రోత్స వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. రేపు నిర్వహించే మెగా ప్లాంటేషన్‌ కార్యక్రమానికి స్థలాన్ని పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ ఊట్కూర్‌ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 9 గంటలకు మండల స్థాయి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.  ఎంపీటీసీ సభ్యుడు హన్మంతు, ఎంపీహెచ్‌వో వేణుగోపాల్‌రెడ్డి, ఏపీఎం నర్సిములు పాల్గొన్నారు.

దామరగిద్ద :  వజ్రోత్సవాలను పురస్కారిం చుకొని శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ నర్సప్ప ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆశమ్మ, వైస్‌ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, రైతు సమన్వయ కమిటీ జిల్లా నాయకులు వెంకట్‌రెడ్డి, కన్కిరెడ్డి, ఎంపిడీవో శశికళ, ఎంపీవో రామ న్న, పంచాయతీ కార్యదర్శి రాజయ్యగౌడ్‌ తదితరులు ఉన్నారు. 

మద్దూర్‌ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫొటో గ్రాఫర్స్‌ మండల అసోసియేషన్‌ సభ్యులు మధుకర్‌, షఫీ, సిద్దు, రామకృష్ణ, మైపాల్‌, శ్రీనివాస్‌, ఉస్మాన్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-08-20T04:41:16+05:30 IST