Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద బాధితులకు రూ.2.5 లక్షల సరుకుల వితరణ

బౌద్ధ ధమ్మపీఠం వ్యవస్థాపకులను అభినందించిన కలెక్టర్‌

కడప(కలెక్టరేట్‌), డిసెంబరు 3: జవాద్‌ తుఫాను ప్రభావంతో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన బౌద్ధ ధమ్మపీఠం వ్యవస్థాపకులు పూజ్య భతేంజి అనలయొను కలెక్టర్‌ విజయరామరాజు అభినందించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వరద బాధితుల సహాయార్థం రూ.2.5 లక్షల విలువైన నిత్యావసర సరుకులు, దుప్పట్లు, బక్కెట్లు, సరుకులు ఉన్న వాహనాన్ని కలెక్టర్‌ విజయరామరాజు బౌద్ధ పతాకావిష్కరణతో కూడిన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నందలూరు, తొగూరుపేట గ్రామాల్లో వరద తాకిడికి గురై నష్టపోయిన 200 మంది కుటుంబాలను ఆదుకునేందుకు బౌద్ధ ధమ్మపీఠం సారథ్యంలో బియ్యం, పంచధార, కందిపప్పుతో కూడిన 25 రకాల నిత్యావసర సరుకుల ప్యాకెట్లను అందజేయడం పట్ల కలెక్టర్‌ అభినందించారు. అనంతరం వారు రాజంపేట ప్రాంతంలోని వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 

Advertisement
Advertisement