గుంటూరు జిల్లాలో కోవిడ్ టీకా పంపిణీలో గందరగోళం

ABN , First Publish Date - 2021-05-07T17:17:38+05:30 IST

జిల్లాలోని కోవిడ్ టీకా పంపిణిలో గందరగోళం చోటు చేసుకుంది. రెండో విడత టీకా కోసం పంపిణీ కేంద్రాల వద్దకు పెద్దఎత్తున్న ప్రజలు తరలివచ్చారు. దీంతో కోవిడ్ టీకా పంపిణీలో గందరగోళం...

గుంటూరు జిల్లాలో కోవిడ్ టీకా పంపిణీలో గందరగోళం

గుంటూరు: జిల్లాలోని కోవిడ్ టీకా పంపిణిలో గందరగోళం  చోటు చేసుకుంది. రెండో విడత టీకా కోసం పంపిణీ కేంద్రాల వద్దకు పెద్దఎత్తున్న ప్రజలు తరలివచ్చారు. దీంతో కోవిడ్ టీకా పంపిణీలో గందరగోళం ఏర్పడింది. టోకెన్ల పంపిణీ సరిగ్గా జరగలేందటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లికార్జున పేటలో నిర్వహించిన టీకా పంపిణీ కేంద్రంలో టోకెన్ల పంపిణీని అధికారులు నిలిపివేశారు. టీకాలు నిలిపివేయడంతో ప్రజలు ఉదయం నుంచి టీకా కోసం పడిగాపులు కాస్తున్నారు. పంపిణీ నిలిపివేయండంతో అధికార యంత్రాంగం తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు టీకా కేంద్రానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Updated Date - 2021-05-07T17:17:38+05:30 IST