కరోనా బాధితులకు భోజనాల వితరణ

ABN , First Publish Date - 2021-05-08T05:29:14+05:30 IST

నగరంలో కరోనా వ్యాధితో బాధపడుతూ హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులతో పాటు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు వారి సహాయకులకు శుక్రవారం అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ఉచిత భోజన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కరోనా బాధితులకు భోజనాల వితరణ
భోజనాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బిగాల

నిజామాబాద్‌అర్బన్‌, మే 7: నగరంలో కరోనా వ్యాధితో బాధపడుతూ హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులతో పాటు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు వారి సహాయకులకు శుక్రవారం అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ఉచిత భోజన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ఉచిత భోజన వితరణ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రిఅ బిగాల కృష్ణమూర్తి ఆశయం ప్రకారం గత ఏడాది కొవిడ్‌ లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించినట్లువంటి సిబ్బందికి 41 రోజుల పాటు ఉచిత భోజనాలు అందించడం జరిగిందన్నారు. ఈ ఏడాది కరోనా సోకి ఇబ్బందులు పడుతున్న కుటుంబ సభ్యులకు భోజనాలు అందించాలనే ఉద్దేశంతో నగరంలోని ఆరు కూడళ్లలో భోజన వితరణ వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఎవరైనా కరోనా సోకిన వారు 7207392708, 7207392709 నంబర్‌లకు ఫోన్‌చేస్తే నగరంలోని వర్ని చౌరస్తా, వినాయక్‌నగర్‌, నెహ్రూపార్క్‌, ఖలీల్‌వాడి, హమాల్‌వాడి చౌరస్తా, కంఠేశ్వర్‌ టెంపుల్‌ వద్ద మధ్యాహ్నం 12 నుంచి 2గంటల వరకు ఈ కూడళ్ల నుంచి భోజన ప్యాకెట్లు పొందవచ్చన్నారు. ఒకవేళ రాలేని పరిస్థితుల్లో కాల్‌ సెంటర్‌ నంబర్‌లకు ఫోన్‌చేస్తే హోం డెలివరీ చేస్తారని తెలిపారు. కరోనాను జయించేందుకు జాగ్రత్తలు పాటించాలని మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌ శేఖర్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌.విపాటిల్‌, కార్పొరేటర్‌లు, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-08T05:29:14+05:30 IST