కరోనా పేషంట్లకు ఆక్సిజన్‌ సిలిండర్ల పంపిణీ

ABN , First Publish Date - 2021-05-06T05:10:48+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో కడప టూటౌన్‌ సీఐ మహ్మద్‌ అలీ మానవత్వం చాటుకున్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు బుధవారం కరోనా వైర్‌సతో బాధపడే పేద ప్రజలకు సీఐ పది ఆక్సిజన్‌ గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేశారు.

కరోనా పేషంట్లకు ఆక్సిజన్‌ సిలిండర్ల పంపిణీ
ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేస్తున్న సీఐ

మానవత్వం చాటుకున్న సీఐ 

కడప(క్రైం), మే 5: కరోనా విపత్కర పరిస్థితుల్లో కడప టూటౌన్‌ సీఐ మహ్మద్‌ అలీ మానవత్వం చాటుకున్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు బుధవారం కరోనా వైర్‌సతో బాధపడే పేద ప్రజలకు సీఐ పది ఆక్సిజన్‌ గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరైనా ఆపద సమయంలో ఆక్సిజన్‌ లేక ఇబ్బందులు పడుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్‌ సిలిండర్లు నగరంలోని చిలకలబావి వద్ద ఉన్న రోష్ని వాటర్‌ ప్లాంటులో అందుబాటులో ఉంటాయని, వాటిని ఉపయోగించుకోవచ్చని సీఐ తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా అధిక ధరలకు గ్యాస్‌ సిలిండర్లు అమ్మితే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ జీవన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-06T05:10:48+05:30 IST