నేటి నుంచి వేరుశనగ విత్తనాలు పంపిణీ

ABN , First Publish Date - 2021-05-17T05:00:22+05:30 IST

జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా సోమవారం నుంచి రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ దొరసాని తెలిపారు.

నేటి నుంచి వేరుశనగ విత్తనాలు పంపిణీ

చిత్తూరు(సెంట్రల్‌), మే 16: జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) ద్వారా సోమవారం నుంచి రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ దొరసాని తెలిపారు. ఆదివారం అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, ఆర్బీకే సిబ్బందితో ఆమె జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1.3 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశనగ సాగు చేస్తున్నారని, ఇందుకోసం 73 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. బస్తా రాయితీ పోను రూ.1563కు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-05-17T05:00:22+05:30 IST