పెండింగ్‌లోని డీఎల్‌, ఆర్సీ కార్డుల పంపిణీ : డీటీసీ

ABN , First Publish Date - 2022-01-19T07:08:48+05:30 IST

పెండింగ్‌లోని డీఎల్‌ (డ్రైవింగ్‌ లైసెన్స్‌), ఆర్సీ (రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌) కార్డులను పంపిణీ చేసినట్లు డీటీసీ బసిరెడ్డి చె ప్పారు.

పెండింగ్‌లోని డీఎల్‌, ఆర్సీ కార్డుల పంపిణీ : డీటీసీ
డీఎల్‌, ఆర్సీ కార్డులను పరిశీలిస్తున్న బసిరెడ్డి

చిత్తూరు సిటీ, జనవరి 18: పెండింగ్‌లోని డీఎల్‌ (డ్రైవింగ్‌ లైసెన్స్‌), ఆర్సీ (రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌) కార్డులను పంపిణీ చేసినట్లు డీటీసీ బసిరెడ్డి చె ప్పారు. మంగళవారం ఆయనమీడియాతో మాట్లాడుతూ.. సాంకేతిక కారణాలవల్ల గత ఏడాది అక్టోబరు నుంచి జనవరి 15వ తేదీవరకు డీఎల్‌, ఆర్సీ కార్డులు అందుబాటులో లేవని చెప్పారు. మూడ్రోజుల కిందట కార్డులు రావడంతో పెండింగ్‌లో ఉన్న కార్డులను ముద్రించి, వాహనదారులకు పోస్టుద్వారా పంపించడం జరిగిందన్నారు. మొత్తం 33వేల కార్డులను ముద్రించామని, వీటిల్లో.. 15వేల డీఎల్‌, 18 వేల ఆర్సీ కార్డులున్నాయని వివరించారు. పోస్టుద్వారా ఈ కార్డులు అందనివారు తమ ఆధార్‌ కార్డుతో జిల్లా రవాణాశాఖ కార్యాలయాన్ని సంప్రదించి, తీసుకోవచ్చని సూచించారు. 

Updated Date - 2022-01-19T07:08:48+05:30 IST