త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-26T06:15:44+05:30 IST

త్వరలో రెండో విడత గొర్రెల పంపి ణీ ప్రారంభించబోతున్నట్లు గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ బాలరాజుయాదవ్‌ తెలిపారు.

త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ
రెడ్లరేపాకలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న గొర్రెల, మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ బాలరాజ్‌ యాదవ్‌

అన్నివర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి  

గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ బాలరాజుయాదవ్‌ 

వలిగొండ, జనవరి 25: త్వరలో రెండో విడత గొర్రెల పంపి ణీ ప్రారంభించబోతున్నట్లు గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ బాలరాజుయాదవ్‌ తెలిపారు. వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నార న్నారు.గొల్ల, కురుమల ఆర్థిక పరిపుష్టికోసం కేసీఆర్‌ గొర్రెల పంపి ణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి రూ.12వేల కోట్లు కేటాయించారన్నా రు. ఈ పథకం కింద మొదటి విడతలో రూ.5వేలకోట్లతో 7,61,89 6 యూనిట్లను గ్రౌండ్‌ చేసి 3,88,000పై చిలుకు యూనిట్లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. తనకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి, గొర్రెల,మేకలకు టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.అదే విధం గా మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో ‘గొర్రె మందల వద్ద పల్లె నిద్ర’ అనే వినూత్న కార్యక్రమాన్ని సోమవారంరాత్రి చేపట్టారు. మండలంలోని వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలో స్వ యంభు శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామిని బాల్‌రాజ్‌యాదవ్‌ దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయిలయ్య, గొర్రెల పెంపకం దారుల జిల్లా డైరెక్టర్లు దేశబోయిన సూర్యనారాయణ, ఆవుల స్వా మి, మండల పశువైద్యాధికారి రామ్మోహన్‌రెడ్డి, జిల్లా జేఏసీ కన్వీనర్‌ అయోధ్య, సర్పంచ్‌లు రేపాక అరుంధతి, కొత్త నర్సింహ, ఎం పీటీసీ నోముల మల్లేశం, పాండరి, వెంకటేశం, పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T06:15:44+05:30 IST