ధాన్యం రైతులకు టోకెన్లు పంపిణీ

ABN , First Publish Date - 2021-11-30T05:30:00+05:30 IST

ధాన్యం రైతులకు టోకెన్లు పంపిణీ

ధాన్యం రైతులకు టోకెన్లు పంపిణీ
చెంగోల్‌లో వడ్ల తేమ శాతాన్ని పరిశీలిస్తున్న ఏఈవో సామెల్‌, మార్కెట్‌ కమిటీ ప్రతినిధి ఎల్లప్ప

తాండూరు రూరల్‌: చెంగోల్‌ లో కొనుగోలు కేంద్రం ద్వారా రోజుకు వెయ్యి క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసేందుకు టోకెన్లు ఇవ్వాలని రైతులు డిమాండ్‌కు అధికారులు స్పందించారు. మంగళవారం ఆంధ్రజ్యోతిలో ‘వెయ్యి క్వింటాళ్లకు టోకెన్లు ఇవ్వాలి’ అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు. చెంగోల్‌ క్లస్టర్‌ ఏఈవో సామెల్‌, తాండూరు డీసీఎంఎస్‌ గోదాం ప్రతినిధి ఎల్లప్ప, గ్రామాన్ని సందర్శించి కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల తేమ శాతాన్ని పరిశీలించారు. రైతుల నుంచి రోజుకు 1,500క్వింటాళ్ల వరకు కొనేందుకు టోకెన్లను ఏఈవో శామెల్‌ అందజేశారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. టోకెన్లు జారీ చేసిన వారిలో రైతులు వేణుగౌడ్‌, రైతులున్నారు.

Updated Date - 2021-11-30T05:30:00+05:30 IST