డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీ.. కేంద్రం అనుమతి

ABN , First Publish Date - 2021-05-08T08:47:21+05:30 IST

రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సిన్లు, ఔషధాలను డ్రోన్ల ద్వారా అందించేందుకు ఉద్దేశించిన ‘మెడిసిన్‌ ఫ్రందస్కై’ ప్రాజెక్టు రాష్ట్రంలో త్వరలో అమల్లోకి రానుంది.

డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీ.. కేంద్రం అనుమతి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి ):  రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సిన్లు, ఔషధాలను డ్రోన్ల ద్వారా అందించేందుకు ఉద్దేశించిన ‘మెడిసిన్‌ ఫ్రందస్కై’ ప్రాజెక్టు రాష్ట్రంలో త్వరలో అమల్లోకి రానుంది. సకాలంలో వైద్య సదుపాయం, అత్యవసర ఔషధాలు అందక మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని రాష్ట్ర ప్రభుత్వం 2019 చివర్లో ఈ ప్రాజెక్టును ప్రకటించింది. దీని కోసం తెలంగాణ ఐటీ శాఖ స్టార్ట్‌పలను ఆహ్వానించగా.. వచ్చిన 16 దరఖాస్తుల్లో ఏడుగురికి ప్రాథమిక ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి పౌర విమానయాన శాఖ పాక్షిక అనుమతులు ఇవ్వగా.. తాజాగా పూర్తిస్థాయి అనుమతులు ఇచ్చిందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ శుక్రవారం తెలిపారు.

Updated Date - 2021-05-08T08:47:21+05:30 IST