అర్హులకు ఆహార భద్రత కార్డులు అందించేందుకు కృషి

ABN , First Publish Date - 2021-07-29T06:57:54+05:30 IST

దారిద్య్రరేఖకు దిగువ ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు అందించేందుకు కృషి చేస్తానని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల చెప్పారు.

అర్హులకు ఆహార భద్రత కార్డులు అందించేందుకు కృషి
ఆహార భద్రత కార్డును అందజేస్తున్న ఎమ్మెల్యే బలాల, పక్కన డీసీఎ్‌సవో రమేష్‌, ఏఎ్‌సవో మల్లికార్జునబాబు తదితరులు

ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల

చాదర్‌ఘాట్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): దారిద్య్రరేఖకు దిగువ ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు అందించేందుకు కృషి చేస్తానని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల చెప్పారు. బుధవారం మలక్‌పేటలోని మెరిడియన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆహర భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఐదు వందల కుటుంబాలకు కార్డులను అందజేశారు. మలక్‌పేట సర్కిల్‌-1 పరిధిలో 6,227 మంది దరఖాస్తు చేసుకోగా, 4,283 కుటుంబాలను అర్హులుగా గుర్తించారని చెప్పారు. తిరస్కరించిన 1,944 దరఖాస్తులను మరోసారి పరిశీలించి, అర్హులైన వారికి ఆహార భద్రత కార్డులు జరీ చేయాలని అధికారులకు సూచించారు. గ కార్యక్రమంలో చావునీ కార్పొరేటర్‌ మహ్మద్‌ షాహిద్‌ మూన్‌, ఎంఐఎం నాయకులు సైఫుద్దీన్‌ షఫీ, షేక్‌ మోహీయుద్దీన్‌ అబ్రార్‌, డీసీఎ్‌సవో ఎ.రమేష్‌, సూపరింటెండెంట్‌ అస్లాం, రేషనింగ్‌ ఇన్‌స్పెక్టర్లు రాజేశ్వర్‌రావు, గోవర్ధన్‌, జ్యోతి, శ్రుతి, ప్రదీప్‌, నరేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-29T06:57:54+05:30 IST