కరోనా కట్టడిలో జిల్లా యంత్రాంగం సక్సెస్‌

ABN , First Publish Date - 2020-06-04T10:30:52+05:30 IST

‘జిల్లాలో కరోనా కట్టడిలో యంత్రాంగం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసింది.

కరోనా కట్టడిలో జిల్లా యంత్రాంగం సక్సెస్‌

లాభసాటి పంటలను ప్రోత్సహించాలి 

సహకార సంఘాల్లో అవకతవకలను అరికట్టాలి

జడ్పీ సమావేశంలో సభ్యుల డిమాండ్‌


నిజామాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘జిల్లాలో కరోనా కట్టడిలో యంత్రాంగం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసింది. వలస కా ర్మికులు జిల్లాకు వస్తూ ఉండడంతో కరోనా ము ప్పు ఇంకా పొంచే ఉంది. మరిన్ని చర్యలు చేప ట్టాలి. నియంత్రిత పద్ద్ధతి లో లాభసాటి పంటలు పండించాలి. రైతాంగానికి అవగాహన కల్పించేందుకు ప్ర తీ ప్రజాప్రతినిధి, అధికారులు కృషిచేయాలి’ అని జడ్పీ సమావేశంలో సభ్యులు సూచించారు.  పీఏసీ ఎస్‌లలో జరిగే అవినీతిని సహించొద్దని సభ్యులు డిమాండ్‌ చేశారు. జడ్పీ సర్వసభ్య సమావేశం చై ర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు అధ్యక్షతన బుధవా రం జరిగింది. వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్‌, సహకార శాఖలతో పాటు ఇతర శాఖలపైన సభ్యులు చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి ఉన్న సమయంలో జిల్లాలో కూడా వ్యాపించిందని వారన్నారు. దీనిని అరికట్టడంలో జిల్లా యంత్రాంగం కృషి బాగా ఉందని సభ్యులు కొనియాడారు. వలస కార్మికులు రావడం వల్ల కరోనా ముప్పు ఇంకా పెరిగిందన్నారు. జిల్లాకు వలస వచ్చిన వారిపైన నిఘా పెట్టామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సభ్యులకు వివరించారు. 


లాభసాటి పంటలే సాగు చేయాలి..

నియంత్రిత పద్ధతిలో లాభసాటి పంటలను సా గు చేయాల కోరిందని వ్యవ సాయాధికారులు స భ్యులకు వివరించారు. వరిలో సన్నరకాల సాగు ఎక్కువగా చేయాలన్నారు. ఈ సన్నరకాల విత్తనాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. దొడ్డు రకాలు వేస్తే రోగాలతో పాటు ఖర్చుకూడా తక్కువగా ఉంటుందని మరికొంత మంది సభ్యులు తెలిపారు. ఉపాధిహామీని కూలీల కొరత ఉన్న ఈ సమయంలో వ్యవసాయ రంగానికి అనుసంధా నం చేయాలని సభ్యులు కోరారు.  సహకార సొ సైటీల్లో కొన్నిచోట్ల అక్రమాల పై వాటిపైన చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. నీలా సొసైటీ చైర్మన్‌, కార్యదర్శి పైన ఎన్నిమార్లు ఫిర్యాదు చేసి నా సహకార అధికారులు పట్టించుకోవడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు.


జిల్లాలో ప్రతీ గ్రా మానికి తాగునీరు అందే విధంగా చూడాలని సభ్యులు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను కోరారు. జిల్లా లో విద్యుత్‌ లైన్ల సమస్యలను త్వ రగా తీర్చాలని సభ్యులు కోరారు. వ్యవసాయ పనులు మొదలయ్యే సమయంలో మరమ్మతులు లేకుం డా చూసుకోవాలని సభ్యులు సూచించారు. ప్రధాన అంశాలపైన ఎజెండాలో సూచించిన విధం గా సమావేశంలో చర్చించారు. రెంజల్‌, చందూర్‌, ఇం దల్వాయి, ధర్పల్లి, మోస్రా, ఎడపల్లి జడ్పీటీసీలతో పాటు పలువురు ఎంపీపీలు తమ మండలాల స మస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని అధికారులను కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ లత, జడ్పీ సీఈవో గోవింద్‌, జడ్పీ టీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-04T10:30:52+05:30 IST