ఓవైపు తండ్రి మరణం.. మరోవైపు వృత్తి ధర్మం

ABN , First Publish Date - 2020-04-09T07:35:04+05:30 IST

దేశానికొచ్చిన కష్టం ముందు తనకొచ్చిన కష్టాన్ని చాలా చిన్నదిగా భావించారాయన. ఒడిస్సాలోని కటక్‌ జిల్లా కలెక్టర్‌ భవానీ శంకర్‌ చైనీ.. జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై...

ఓవైపు తండ్రి మరణం.. మరోవైపు వృత్తి ధర్మం

  • బాధలోనూ బాధ్యత మరవని కలెక్టర్‌


భువనేశ్వర్‌ (ఒడిస్సా), ఏప్రిల్‌ 8: దేశానికొచ్చిన కష్టం ముందు తనకొచ్చిన కష్టాన్ని చాలా చిన్నదిగా భావించారాయన. ఒడిస్సాలోని కటక్‌ జిల్లా కలెక్టర్‌ భవానీ శంకర్‌ చైనీ.. జిల్లాలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆయన తండ్రి, మాజీ కలెక్టర్‌ దామోదర్‌ చైనీ(98) కన్నుమూశారన్న వార్త ఆయనకు తెలిసింది. అయినా ఆయన చలించలేదు. దుఃఖాన్ని దిగమింగుకున్నారు. పని పూర్తిచేసుకున్నాకే ఇంటికి వెళ్లారు. ఈ ఘటనపై ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్పందించారు. ‘‘ఇంత పెద్ద దుఃఖంలోనూ.. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా దేశసేవకు అంకితమైన కలెక్టర్‌ భవానీ చైనీకి సెల్యూట్‌’’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు.


Updated Date - 2020-04-09T07:35:04+05:30 IST