భూముల రీ సర్వే పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ

ABN , First Publish Date - 2021-06-18T05:40:05+05:30 IST

శాశ్వత భూ హక్కు మరియు భూముల పరిరక్షణ పేరుతో ప్రస్తుతం జరుగుతున్న భూముల రీ సర్వే పనులను పర్యవేక్షించి సమన్వయ పరచడం కోసం జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి గురువారం ఆదేశాలు జారీ చేశారు.

భూముల రీ సర్వే పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ

కలికిరి, జూన్‌ 17: శాశ్వత భూ హక్కు మరియు భూముల పరిరక్షణ పేరుతో ప్రస్తుతం జరుగుతున్న భూముల రీ సర్వే పనులను పర్యవేక్షించి సమన్వయ పరచడం కోసం జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి గురువారం ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరు అధ్యక్షులుగా, జేసీ (ఆర్బీకే, రెవెన్యూ), జేసీ (సచివాలయాలు, అభివృద్ధి), జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఎఫ్‌ఎస్‌వో లేదా కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టరు, ముగ్గురు ఆర్డీవోలు, జిల్లా పంచాయతీ అధికారులు సభ్యులుగా, సర్వే మరియు ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ మెంబర్‌ కన్వీనరుగా ఈ కమిటీ ఏర్పాటు కానుంది.  

Updated Date - 2021-06-18T05:40:05+05:30 IST