జిల్లా కోర్టు ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-03T04:46:25+05:30 IST

జిల్లా కోర్టును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ, సీఎం కేసీఆర్‌తో కలిసి గురువారం వర్చు వల్‌గా ప్రారంభించారు. జిల్లాజడ్జి బి. సత్తయ్య ఆధ్వర్యంలో వేద పండితులతో పూజ కార్యక్రమాన్ని నిర్వహించి శిలాఫలా కాన్ని ఆవిష్కరించారు. జిల్లాజడ్జి కేక్‌కట్‌చేసి వేడుకలు నిర్వ హించారు.

జిల్లా కోర్టు ప్రారంభం
జిల్లా కోర్టు ప్రారంభంలో పాల్గొన్న జడ్జీలు

ఏసీసీ, జూన్‌ 2: జిల్లా కోర్టును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్ర శర్మ, సీఎం కేసీఆర్‌తో కలిసి గురువారం వర్చు వల్‌గా ప్రారంభించారు. జిల్లాజడ్జి బి. సత్తయ్య ఆధ్వర్యంలో వేద పండితులతో పూజ కార్యక్రమాన్ని నిర్వహించి శిలాఫలా కాన్ని ఆవిష్కరించారు. జిల్లాజడ్జి  కేక్‌కట్‌చేసి వేడుకలు నిర్వ హించారు. జడ్జి మాట్లాడుతూ నూతన జిల్లాల ప్రకారం కోర్టులను ఏర్పాటు చేయడం న్యాయవాదులకు, కక్షిదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కోర్టుల సంఖ్య పెరగడం వల్ల కేసులు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి ఉదయ్‌కుమార్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి ఉపనిషద్‌, రసూల్‌, మహాతివైష్ణవి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-03T04:46:25+05:30 IST