Abn logo
Oct 23 2021 @ 23:19PM

జిల్లా జడ్జీతో కలెక్టర్‌ భేటీ

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ వీ రవీంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

గుంటూరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబుతో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ సమావేశమయ్యారు. శనివారం ఉదయం  జిల్లా జడ్జ్జి కార్యాలయానికి వెళ్లిన కలెక్టర్‌ తొలుత పుష్పగుచ్ఛాన్ని అందించారు. అనంతరం అండర్‌ ట్రైల్‌ రివ్యూ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అండర్‌ ట్రైల్‌ ఖైదీలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రూరల్‌ ఎస్‌పీ విశాల్‌ గున్నీ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రత్నకుమార్‌, అర్బన్‌ అదనపు ఎస్‌పీ గంగాధరం, రూరల్‌ అదనపు ఎస్‌పీ రిషాంతరెడ్డి, జైలు సూపరింటెండెంట్‌ డీఎస్‌పీ హంసాపాల్‌, డీసీఆర్‌బీ డీఎస్‌పీ లక్ష్మయ్య, జైలర్‌ కిరణ్‌, సబ్‌జైలర్‌ ప్రేమసాగర్‌ పాల్గొన్నారు.