మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందిస్తున్న దృశ్యం
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో వినతులు
సదర్మాట్ బ్యారేజీ పరిహారం నిధులు విడుదల చేయండి..
నిర్మల్ మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
నిర్మల్ కల్చరల్, ఏప్రిల్ 8 : జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నేతృత్వంలో గురువారం మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లను జిల్లా నేతలు కలిసి విన్నవించారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్రెడ్డిలు మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు. కాగా నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న వివిధ అభి వృద్ధి పనులను వీరు మంత్రి కేటీఆర్‌కు వివరించారు. పట్టణంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల మంత్రి కేటీఆర్ చైర్మన్ ఈశ్వర్‌ను ఈ సందర్భం గా అభినందించారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని 42వ వార్డుల అభివృద్ది ప నులకు నిధులు మంజూరు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అనుమతు లు ఇవ్వాలంటూ కోరారు. అలాగే సదర్మాట్ బ్యారేజీ నిర్వాసితులకు సంబంధించి పరిహారం డబ్బులు ఇప్పటి వరకు చెల్లించలేదని వీరు మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే పరిహారానికి సంబంధించిన నిధులను విడుదల చేయాలని వీరు కోరగా ఈ నిధుల విడుదలకు మంత్రి హమీనిచ్చారు. దీంతో పాటు మరికొన్ని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.