Abn logo
Apr 8 2020 @ 03:57AM

‘క్వారంటైన్‌’ను పరిశీలించిన జిల్లా ప్రత్యేకాధికారి

అమలాపురం రూరల్‌, ఏప్రిల్‌ 7: భట్లపాలెం బీవీసీ ఇంజ నీరింగ్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన కొవిడ్‌-19 క్వారంటైన్‌ కేం ద్రాన్ని జిల్లా ప్రత్యేకాధికారి బి.రాజశేఖర్‌ పరిశీలించారు. క్వారంటైన్‌లో ఉంచిన 30మందికి నెగిటివ్‌ రిపోర్టులు రావడంతో ఇళ్లకు పంపించి హోం క్వారంటైన్‌ చేశామని వైద్యులు వివరించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలిచ్చారు. అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ సెం టర్‌, క్వారంటైన్‌ గదులను కూడా ఆయన పరిశీలించారు.  సెంటర్‌లో ఉన్న పడకలు, వైద్యపరికరాలు తదితర వివరాల ను సెంటర్‌ ఇన్‌చార్జ్‌, జడ్పీ సీఈవో ఎం.పద్మ, కిమ్స్‌ డీన్‌ డాక్టర్‌ ఏఎస్‌.కామేశ్వరరావులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీవో బీహెచ్‌.భవానీశంకర్‌, తహశీల్దార్‌ కేవీ.మాధవరావు, ఎంపీడీవో ఎం.ప్రభాకరరావు ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement