ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీ వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-04-21T06:18:51+05:30 IST

ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీ వద్ద ఉద్రిక్తత

ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీ వద్ద ఉద్రిక్తత
రెండో డోసు టీకా కోసం ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీకి తరలివచ్చిన ప్రజలు

 ఫ్రంట్‌లైన్‌ వారియర్లకే టీకా అన్న అధికారులు

రెండో డోసు కోసం తరలివచ్చిన ప్రజల ఆగ్రహం 

ఇబ్రహీంపట్నం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు వేసుకున్న వారు రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ల కొరత వలన రెండో డోసు ఆలస్యమైంది. మంగళవారం వ్యాక్సిన్లు ఆస్పత్రికి వచ్చాయనే సమాచారం తెలియడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రెండో డోసు కోసం ఆస్పత్రికి తరలివచ్చారు. రెండో డోసు ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు మాత్రమే ఇవ్వాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశాలు ఇచ్చారని.. ముందుకు వారికి వేశాక ప్రజలకు వేస్తామని వైద్యులు నచ్చజెప్పారు. అయినా వినకపోవటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులకు వైద్యులు సమాచారమివ్వగా వారు వచ్చి పరిస్థితులను చక్కదిద్దారు. ప్రజలు సహనంతో ఉండాలని ప్రతి ఒక్కరికీ రెండో డోసు వస్తుందని, ఆందోళన చెందవద్దని పీహెచ్‌సీ డాక్టర్‌ సుధాప్రసూజ తెలిపారు. 


Updated Date - 2021-04-21T06:18:51+05:30 IST