Advertisement
Advertisement
Abn logo
Advertisement

మళ్లించిన నిధులు జమ చేయాలి


రాష్ట్ర పంచాయతీరాజ్‌ చాంబర్స్‌ ఉపాధ్యక్షుడు నాగరాజు డిమాండ్‌ 

పాడేరు, డిసెంబరు 2: పంచాయతీల నుంచి రాష్ట్రప్రభుత్వం మళ్లించిన నిధులను తక్షణమే తిరిగి జమ చేయాలని పంచాయతీరాజ్‌ చాంబర్స్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో గురువారం ఇక్కడ ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘ నిధులు విడుదల చేస్తే, పంచాయతీల అనుమతి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందన్నారు.  తమ డిమాండ్లపై ఎంపీడీవో కార్యాలయం అధికారికి వినతిపత్రం సమర్పించారు. నిరసనలో టీడీపీ నేత కొట్టగుళ్లి సుబ్బారావు, సర్పంచ్‌ కె. ఉషారాణి, ఉపసర్పంచ్‌ బూరెడ్డి రామునాయుడు, కిండంగి సర్పంచ్‌ గొండెలి సర్పంచ్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement