Advertisement
Advertisement
Abn logo
Advertisement

ద్వితీయార్థంలో దివీస్‌ రూ.300 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సామర్థ్యాలను పెంచుకునే వ్యూ హంలో భాగంగా దివీస్‌ ల్యాబ్స్‌ పెట్టుబడులను పెంచనుంది. ఇప్పటికే దాదాపు రూ.1,800 కోట్ల ప్రణాళికలను అమలు చేస్తున్న కంపెనీ.. సింథసిస్‌ బ్లాక్‌లపై రూ.400 కోట్లు, కాకినాడ కొత్త ప్రాజెక్టుపై రూ.1,000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించింది. గత ఐదేళ్లలో దాదాపు రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టిన దివీస్‌ సామర్థ్యాల విస్తరణకు మరిన్ని పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో రూ.300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. జనరిక్‌ ఏపీఐలు, ఇంటర్మీడియెట్లు, యాక్టివ్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌కు కస్టమ్‌ సింథసిస్‌ తయారీలో దివీస్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ చైనాపై ఆధారపడుతున్న కంపెనీలు దాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్న నేపథ్యంలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవలని భావిస్తోంది. 

Advertisement
Advertisement