విడాకులిచ్చిన భార్యను కిడ్నాప్‌నకు యత్నించి...

ABN , First Publish Date - 2021-04-20T14:16:07+05:30 IST

విడాకులిచ్చాక భార్యను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడో వ్యక్తి.

విడాకులిచ్చిన భార్యను కిడ్నాప్‌నకు యత్నించి...

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : విడాకులిచ్చాక భార్యను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడో వ్యక్తి. అంతే కాకుండా ఆమెపై దాడి చేసి గాయపర్చాడు. జూబ్లీహిల్స్‌లో నివాసముండే మహిళ కొద్ది కాలం క్రితం చావ వినయ్‌ చౌదరిని వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య మనస్పర్ధాలు ఏర్పడ్డాయి. భర్త గృహహింస పెడుతుండడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకులు కూడా తీసుకున్నారు. అయితే ఈ నెల 18న వినయ్‌ ఆమె ఇంట్లోకి ప్రవేశించి కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. స్థానికులు వినయ్‌ను అడ్డుకొని జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతడిపై ఐపీసీ 448,354,427,506 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-20T14:16:07+05:30 IST