Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాలుగేళ్ల క్రితం పెళ్లి.. ఆరు నెలల క్రితం విడాకులు.. తాజాగా ఆమె మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ను చూసి షాక్..

వారిద్దరికీ నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది.. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.. ఆరు నెలల క్రితం విడాకులు తీసుకున్నారు.. ఎవరి బతుకు వారు బతుకుతున్నారు.. తాజాగా ఆమె ఖాతా నుంచి రూ.5 లక్షలు విత్ డ్రా అయినట్టు ఆమె మొబైల్ నెంబర్‌కు ఓ మెసేజ్ వచ్చింది.. ఎవరు తీశారని ఎంక్వైరీ చేస్తే మాజీ భర్త అని తేలింది.. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 


మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన మనీషా చౌదరి, రఘునందన్ 2017లో వివాహం చేసుకున్నారు. మూడేళ్లు పూర్తయ్యేసరికి వారి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఆరు నెలల క్రితం వారికి విడాకులు మంజూరయ్యాయి. అయితే భార్యకు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ వివరాలు తెలిసినందున రఘునందన్ ఆమె ఖాతా నుంచి రూ.5 లక్షలు విత్‌డ్రా చేశాడు. ఆ విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్న మనీషా మాజీ భర్తపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement