Abn logo
Oct 18 2020 @ 15:00PM

నాగేంద్రబాబుపై అనుమానాలు పెంచుతున్న దివ్య ఇన్‌స్టా వీడియో

Kaakateeya

విజయవాడ: బీటెక్ స్టూడెంట్ దివ్య తేజస్విని కేసులో మిస్టరీ కొనసాగుతోంది. ఈ కేసులో మిస్టరీని చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసులో నిందితుడు నాగేంద్రబాబు చెప్పినదానికి, దివ్య తేజస్విని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోకి వ్యత్యాసం ఉండటంతో.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో నాగేంద్రబాబు టార్చర్‌పై దివ్య తేజస్విని ఆవేదన వ్యక్తం చేయడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. దీంతో దివ్యతేజస్వినికి క్లోజ్‌గా ఉండే ఫ్రెండ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫాలోవర్స్ ద్వారా పలు వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దివ్యతేజస్విని, నాగేంద్రబాబు మధ్య తలెత్తిన విభేదాల అనంతరం నాగేంద్రబాబుతో దివ్య ఫ్రెండ్స్ ఎవరెవరు బాగా సన్నిహితంగా మెలిగారన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. హత్య జరిగిన ప్రదేశంలో నాగేంద్రబాబుతో పాటు అతని స్నేహితులు ఇంకెవరైనా ఉన్నారా..? అన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement