Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్నిరంగాల్లో దివ్యాంగులు రాణించాలి: పీడీ పద్మ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

దివ్యాంగులు అన్నిరంగాల్లో రాణించాలని ఐసీడీఎస్‌ పీడీ జ్యోతి పద్మ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినో త్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల క్రీడా పోటీ లు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో పీడీ పద్మ మాట్లాడారు. సమావేశంలో డీఈవో అశోక్‌, అధికారులు దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు నయీమ్‌, నాగేశ్వర్‌రావు, జహీర్‌బాబా పాల్గొన్నారు. దివ్యాంగులపై సీఎం కేసీఆర్‌ వ్యవహారశైలీని తప్పుపడుతూ కలెక్టరేట్‌ ఎదుట దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అఽధ్యక్షుడు గిద్దె రాజేష్‌ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ది సొసైటీ ఫర్‌ ఎడ్యుకేషన్‌, రీహా బిలేషన్‌ ఆఫ్‌ ది డిసేబుల్స్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మదనాచారి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీని జెండాఊపి ప్రారంభించారు.ఆత్మకూర్‌(ఎ్‌స)లో విద్యా ర్థులతో ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో ఎంఈవో ధారాసింగ్‌ ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ రవి, హెచ్‌ఎం సంతో్‌షకుమార్‌, మదనచారి పాల్గొన్నారు. తుంగతుర్తిలో ఆటల పోటీల విజేతలకు ఎంపీడీవో ఉపేందర్‌రెడ్డి బహుమతులు అందజేశారు. మేళ్లచెర్వులో ఎంఈవో సైదానాయక్‌ బహుమతులు అందజేశారు. హుజూర్‌నగర్‌లోని భవిత దివ్యాంగుల కేం ద్రంలో ఎంఈవో సైదానాయక్‌ దుప్పట్లు పంపిణీ చేశారు. మెరుగుమాల వెంకటేశ్వరరావు కుమారులు చిన్నారులకు దుప్పట్లు అందించారు. కోదాడలో శనగల రాధాకృష్ణ దివ్యాంగుల ఆశ్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్యాంసుందర్‌ పాల్గొన్నారు. దివ్యాంగులను సమాజం వివక్ష చూపరాదన్నారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు జగన్‌మోహన్‌, ప్రముఖ న్యాయవాది ముల్కా వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. నూతనకల్‌లో దివ్యాంగులకు ఎంఈవో రాములు నాయక్‌ బహుమతులు అందజేశారు. సూర్యాపేట మండలం అపూర్వ బధిరుల పాఠశాలలో సుధాకర్‌ పీవీసీ అధినేత మీలా మహాదేవ్‌ జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు చెవిమిషన్లు అందజేశారు. అమ్మ ఆసుపత్రి డాక్టర్‌ సుధీర్‌ 50మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చిలుకూరులో ఎం ఈవో సలీం షరీఫ్‌ విద్యార్థులకు విజేతలకు బహుమతులు అందజేశారు. మఠంపల్లిలో ఎంఈవో ఛత్రునాయక్‌ క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. పెన్‌పహాడ్‌లో ఎంఈవో నకిరేకంటి రవి క్రీడా పోటీల విజేతలకు బహుమతులను  అందజేశారు. తిరుమలగిరిలోని భవిత కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తహ సీల్దార్‌ సంతో్‌షకిరణ్‌, ఎంఈవో శాంతయ్య, ఎంపీడీవో ఉమే్‌షచారి, వాణి, వెంకన్న, పాల్గొన్నారు. నేరేడుచర్లలో లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో దివ్యాంగుడు వెంకటేశ్వర్లు కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ చైర్మన్‌ బట్టు మధు, కొణతం సీతారాంరెడ్డి, చల్లా ప్రభాకర్‌రెడ్డి కందిబండ శ్రీనివాసరావు, చింతకుంట్ల పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు. అర్వపల్లిలో నిర్వహించిన ర్యాలీలో ఎంఈవో బాలునాయక్‌ పాల్గొన్నారు. అనంతగిరిలోని భవిత కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివా్‌సరావు ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భవిత కేంద్రం సభ్యురాలు మమత, ప్రిన్సిపల్స్‌ భారతి పాల్గొన్నారు.  

కోదాడలో నృత్యం చేస్తున్న దివ్యాంగుడిని అభినందిస్తున్న జడ్జి శ్యాంసుందర్‌


Advertisement
Advertisement