దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2020-12-04T06:45:43+05:30 IST

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా సంక్షేమ అధికారి స్రవంతి అన్నారు.

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి

జిల్లా సంక్షేమ అధికారి స్రవంతి

నిర్మల్‌ టౌన్‌, డిసెంబరు 3 : దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా సంక్షేమ అధికారి స్రవంతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని టీఎన్జీవో భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌ దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం నుండి ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్‌ డైరెక్టర్‌ శైలజ వేబినార్‌ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ద్వారా దేశంలో ఉన్న ప్రముఖ వక్తల చేత దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అనంతరం జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అన్ని శాఖల ద్వారా దివ్యాంగులను ఆదుకోవాలని సూచించారు. జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్‌ మాట్లాడుతూ దివ్యాంగులకు సదరన్‌ ధృవీకరణ పత్రాల అందజేత కొరకు వీలైనన్నీ క్యాంపులను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ డీపీఎం వెంకట సాయి, దేవి మురళీ, సగ్గం రాజు, సీనియర్‌ అసిస్టెంట్‌ కేసరి, దివ్యాంగుల సంక్షేమ శాఖ నాయకులు ప్రవీణ్‌ కుమార్‌, సత్తి సాయన్న, సురేందర్‌, క్రాంతి కుమార్‌, నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T06:45:43+05:30 IST