హోరాహోరీ

ABN , First Publish Date - 2021-06-12T10:33:48+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ అంచనాలకు తగ్గట్టే సాగుతోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్‌ నడాల్‌, నొవాక్‌ జొకోవిచ్‌ నువ్వా.. నేనా అనే రీతిలో పోరాడుతున్నారు.

హోరాహోరీ

నడాల్‌తో జొకోవిచ్‌ సెమీస్‌ 


ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ అంచనాలకు తగ్గట్టే సాగుతోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ రఫెల్‌ నడాల్‌, నొవాక్‌ జొకోవిచ్‌ నువ్వా.. నేనా అనే రీతిలో పోరాడుతున్నారు. శుక్రవారం కడప టి వార్తలందేసరికి తొలిసెట్‌ను నడా ల్‌ 6-3తో గెలవగా రెండో సెట్‌లో జొకో 4-2తో ఆధిక్యంలో ఉన్నాడు. అంతకు ముందు తొలి సెట్‌లో నడాల్‌ వరుసగా ఐదు గేమ్‌లు నెగ్గాడు. కానీ గంటపాటు సాగిన ఈ సెట్‌ ఆరంభం.. చివర్లో జొకోవిచ్‌ అద్భుతంగా పోరాడాడు.


దీంతో తొలి గేమ్‌ మూడు డ్యూస్‌లతో తొమ్మిదిన్నర నిమిషా లు సాగగా.. రెండో గేమ్‌ కూడా డ్యూస్‌ వరకూ వెళ్లింది. అయితే బ్రేక్‌ పాయింట్‌తో నడాల్‌ 2-0 ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత సర్వీ్‌సను కాపాడుకుంటూ మరో బ్రేక్‌ పాయింట్‌ సాధించగా స్కోరు 5-0కి వెళ్లింది. ఈ దశలో జొకో వరుసగా మూడు గేమ్‌లు నెగ్గాడు. తొమ్మిదో గేమ్‌లోనూ అతడు పోరాడినా చివరకు నెట్‌.. వ్యాలీ షాట్లతో నడాల్‌ గట్టెక్కాడు.

Updated Date - 2021-06-12T10:33:48+05:30 IST