ఎన్నికలకు వెళ్దామా? సీఎంకు డీకే ఛాలెంజ్

ABN , First Publish Date - 2021-07-26T03:16:13+05:30 IST

రాష్ట్రంలో వరదలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని డీకే ప్రశ్నించారు. కర్ణాటకకు ప్రధాని ఎందుకు రాలేదని నిలదీశారు. రాష్ట్రం నుంచి 25 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని, రాష్ట్ర పరిస్థితిని బాగు పర్చడానికి

ఎన్నికలకు వెళ్దామా? సీఎంకు డీకే ఛాలెంజ్

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంలో మార్పులు జరగబోతున్నాయంటూ వస్తున్న వార్తల నడుమ అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీ కొన్ని సవాళ్లు ముందుంచింది. మార్పులు పార్టీ వ్యక్తులు కాకుండా ప్రజలు చేయాలని, దమ్ముంటే ఎన్నికలకు వెళ్దామని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ సవాల్ విసిరారు. భారతీయ జనతా పార్టీకి పాలన చేసే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదని ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు.


‘‘ప్రజలను ఎలా కాపాడాలో భారతీయ జనతా పార్టీకి తెలియదు. వారికి పాలించే సామర్థ్యం కానీ, నిజాయితీ కానీ లేదు. ఓ వైపు ప్రజలు చనిపోతుంటే వీళ్లకు రాజకీయాలు మాత్రమే కావాలి. యడియూరప్ప ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల ముందుకు వెళ్దాం. ప్రజలనే తీర్పు ఇస్తారు. ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ సిద్ధమేనా?’’ అని డీకే సవాల్ విసిరారు.


రాష్ట్రంలో వరదలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని డీకే ప్రశ్నించారు. కర్ణాటకకు ప్రధాని ఎందుకు రాలేదని నిలదీశారు. రాష్ట్రం నుంచి 25 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని, రాష్ట్ర పరిస్థితిని బాగు పర్చడానికి ఒక్క ఎంపీకి సామర్థ్యం లేదని డీకే విమర్శించారు.

Updated Date - 2021-07-26T03:16:13+05:30 IST