సస్పెండైన బిల్‌కలెక్టర్‌పై డీఎల్‌పీఓ విచారణ

ABN , First Publish Date - 2021-07-30T06:23:57+05:30 IST

తలుపుల గ్రామ పంచాయతీ కార్యా లయంలో సస్పెండైన బిల్‌కలెక్టర్‌ గంగాధర్‌పై గురువారం డీఎ ల్‌పీఓ విజయ్‌కుమార్‌ విచారణ చేపట్టారు.

సస్పెండైన బిల్‌కలెక్టర్‌పై డీఎల్‌పీఓ విచారణ

  తలుపుల, జూలై 29: తలుపుల గ్రామ పంచాయతీ కార్యా లయంలో  సస్పెండైన బిల్‌కలెక్టర్‌ గంగాధర్‌పై గురువారం డీఎ ల్‌పీఓ విజయ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. తలుపుల గ్రామ పంచాయతీ కార్యాలయంలో బిల్‌కలెక్టర్‌గా గంగాధర్‌ పనిచేస్తూ ఇంటి పన్ను, నీటి పన్నులు తదితర వాటిలో అక్రమాలకు పాల్ప డటంతో అతన్ని జిల్లా ఉన్నతాధికారులు 2019లో సస్పెండ్‌ చేశా రు. జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు విచారణ చేయ డానికి వచ్చినట్లు తెలిపారు. నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచా యతీ కార్య దర్శి ఈశ్వరయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T06:23:57+05:30 IST