నూరు శాతం పన్నులు వసూలు చేయాలి

ABN , First Publish Date - 2022-01-22T03:49:08+05:30 IST

పంచాయతీ కార్యదర్శులు వారి పరిధిలోని పంచాయతీల్లో అన్ని రకాల పన్నుల వసూలును నూరు శాతం పూర్తి చేయాలని కావలి డీఎల్‌పీవో రమేష్‌ పేర్కొన్నారు.

నూరు శాతం పన్నులు వసూలు చేయాలి
రికార్డులు తనిఖీ చేస్తున్న డీఎల్‌పీవో రమేష్‌

ఉదయగిరి రూరల్‌, జనవరి 21: పంచాయతీ కార్యదర్శులు వారి పరిధిలోని పంచాయతీల్లో అన్ని రకాల పన్నుల వసూలును నూరు శాతం పూర్తి చేయాలని కావలి డీఎల్‌పీవో రమేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కొండాయపాళెం, తిరుమలాపురం పంచాయతీ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత రికార్డులు తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందజేశారు. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవడంతోపాటు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు అమర్‌నాధ్‌రెడ్డి, సుధాకర్‌, నాగూర్‌బీ, సర్పంచు కె.కృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T03:49:08+05:30 IST