నిర్ధారణ పరీక్షల్లో నిర్లక్ష్యం చేయొద్దు

ABN , First Publish Date - 2021-05-11T06:17:07+05:30 IST

నిర్ధారణ పరీక్షల్లో నిర్లక్ష్యం చేయొద్దు

నిర్ధారణ పరీక్షల్లో నిర్లక్ష్యం చేయొద్దు

ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో సుధార్‌సింగ్‌

గణపురం, మే 10 : కరోనా లక్షణాలున్న వారికి నిర్ధారణ పరీక్షలు  తప్పనిసరిగా చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని భూపాలపల్లి ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో సుధార్‌సింగ్‌ ఆదేశించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా విధులను సమర్థంగా నిర్వర్తించాలని అన్నారు. స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారికి అవగాహన కల్పించి వెంటనే పరీక్షలు చేయాలని అన్నారు. అలాగే మండల కేంద్రంలోని ప్రైవేటు మెడికల్‌ షాపులను ఆయన తనిఖీ చేశారు. చట్ట విరుద్ధంగా ఏవైనా మందులు విక్రయాలు జరుపు తున్నారా..? అని పరిశీలించారు. కాలం చెల్లిన మందులు ఉన్నాయా..? అని ఆరా తీశారు. చట్ట విరుద్ధంగా కరోనా నివారణ మందులు ప్రైవేటుగా విక్ర యించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట డీడీవో ఉమాదేవి, పీహెచ్‌సీ వైద్యులు శ్రీనాథ్‌, శ్రీదేవి, ఫార్మసిస్టు సదయ్య, ఆరోగ్యమిత్ర బాలరాజు ఉన్నారు.

Updated Date - 2021-05-11T06:17:07+05:30 IST