కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను పరిశీలించిన డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2021-05-18T06:13:16+05:30 IST

పెదకూరపా డులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అ ధికారి డాక్టర్‌ జొ న్నలగడ్డ యాస్మిన్‌ సోమవారం పరిశీలించారు.

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను పరిశీలించిన డీఎంహెచ్‌వో
అధికారులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌

పెదకూరపాడు, మే 17: పెదకూరపా డులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అ ధికారి డాక్టర్‌ జొ న్నలగడ్డ యాస్మిన్‌ సోమవారం పరిశీలించారు.  కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో వసతుల గు రించి రోగులను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌పై ప్రత్యే క శ్రద్ధతో అధికారులు, వైద్యసిబ్బంది విధులు నిర్వహించాలని ఆదే శించారు. ఆక్సిజన్‌, మందుల కొరత లేకుండా పర్యవేక్షించాలని అధి కారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం.భవానీ శంకర్‌, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ప్రియాంక పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని 75 త్యాళ్లూరులోని ప్రాఽథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. 

Updated Date - 2021-05-18T06:13:16+05:30 IST