Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 20 2021 @ 09:06AM

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు డీఎంకే మిత్రపక్షాల ధర్నా

పది రోజుల పాటు ఆందోళన

ఇళ్ళ వద్ద నల్లజెండాలతో నిరసన


అడయార్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేటి నుంచి పది రోజుల పాటు విపక్ష పార్టీలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. చెన్నై నగరంలో జరిగే ఈ ఆందోళనలో అధికార డీఎంకేతో పాటు దాని మిత్రపక్ష పార్టీలకు చెందిన నేతలు పాల్గొననున్నారు. ముఖ్యంగా కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలు, పెట్రోల్‌, డీజల్‌, వంట గ్యాస్‌ ధరల బాదుడు వంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ ఆందోళనను చేపట్టనున్నాయి. ఇదే విషయంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌, ద్రావిడ కళగం అధ్యక్షుడు కె.వీరమణి, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌, సీపీఐ కార్యదర్శి ఆర్‌.ముత్తరసన్‌, ఇండియన్‌ యూనియన్‌ లీగ్‌ అధ్యక్షుడు ఖాదర్‌ మొహిద్దీన్‌, వీసీకే ప్రధాన కార్యదర్శి తోల్‌ తిరుమావళవన్‌, కొంగునాడు మక్కల్‌ కట్చి అధ్యక్షుడు ఈశ్వరన్‌, మణిదనేయ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు జవాహిరుల్లా, తమిళగ వాళ్‌ ఉరిమై కట్చి అధ్యక్షుడు వేల్‌మురుగన్‌లు కలసి ఈనెల 5వ తేదీన ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 


కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సారథ్యంలో గత నెల 20వ తేదీన జరిగిన సమావేశంలో మూడు సాగుచట్టాలు రద్దు, పెట్రోల్‌, డీజల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తు ధరల పెరుగుదల, ప్రభుత్వ సంస్థల విక్రయం, ప్రైవేటీకరణ, పెరిగిపోతున్న నిరుద్యోగం, పబ్లిక్‌ రంగ సంస్థలను విక్రయించడం వంటి ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పది రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు, ఇందులో భాగంగా నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళన జరుగనుంది. ముఖ్యంగా ఉదయం 10 గంటల సమయంలో తమతమ ఇళ్ళ ముందు నల్లజెండాలు చేతపట్టుకుని నిరసన తెలపాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో డీఎంకే కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలంతా పాల్గొని విజయంతం చేయాలని కూటమి నేతలు కోరారు. 


TAGS: DMK Tamilnadu

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement