Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 27 2021 @ 19:12PM

మహిళలపై అసభ్య కామెంట్స్..డీఎమ్‌కే నేతపై విమర్శల వెల్లువ!

చెన్నై: విదేశీ ఆవుల పాలు తాగి మహిళలు లావైపోయారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు నేత దిండిగల్ లియోనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఎమ్‌‌కే తరుఫున ప్రచారం చేపట్టిన ఆయనపై తమిళనాడులోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీజేపీ కళలు, సంస్కృతిక విభాగానికి నేతృత్వం వహిస్తున్న గాయత్రీ రఘురామ్ లియోనీపై మండిపడ్డారు. తాను ఏ గేదే పాలు తాగుతారో ఆయన చెప్పాలి. ప్రసవం తరువాత మహిళల్లో ఎటువంటి  మార్పులు జరుగుతాయో లియోనీకి తెలుసా. మహిళలకు మీ పార్టీ నేతలు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ప్రచారం సందర్భంగా దిండిగల్ లియోనీ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. ‘షెడ్‌లలో యంత్రాల ద్వారా విదేశీ ఆవుల నుంచి పాలుపితుకుతున్నారు. అవి తాగిన మహిళల శరీరాకృతిలో విపరీతంగా మార్పు వచ్చింది. ఒకప్పుడు మనదేశంలోని మహిళ  ఆకృతి 8 అంకెను పోలీనట్టు ఉండేది. బడ్డలను ఎత్తుకుంటే వారు కిందకు జారిపోకుండా ఉండేవారు. కానీ మహిళలు ఇప్పుడు డ్రమ్ముల మాదిరి మారిపోయారు. ఇప్పుడు వారు పిల్లల్ని ఎత్తుకోలేకపోతున్నారు.’ అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

Advertisement
Advertisement