Advertisement
Advertisement
Abn logo
Advertisement
May 6 2021 @ 17:59PM

Tamil Nadu : స్టాలిన్ మంత్రివర్గంలో కాబోయే మంత్రులు వీరే!

చెన్నై : తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన మంత్రివర్గం వివరాలను వెల్లడించారు. శాసన సభ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. బుధవారం ఆయన గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఈ మంత్రివర్గంలో దురైమురుగన్ నెంబర్-2 స్థానంలో కనిపిస్తున్నారు. మంత్రులుగా నియమితులు కాబోయేవారి పేర్లను స్టాలిన్ గవర్నర్ పురోహిత్‌కు సిఫారసు చేశారు. ఈ సిఫారసులను గవర్నర్ ఆమోదించినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది. 


234 మంది ఎమ్మెల్యేలున్న శాసన సభలో డీఎంకే 133 స్థానాలను సాధించింది. డీఎంకే శాసన సభా పక్ష నేతగా స్టాలిన్‌ మంగళవారం ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయనతోపాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రుల వివరాలను గురువారం వెల్లడించారు. ముఖ్యమంత్రి మినహా 33 మందితో ఈ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. 


స్టాలిన్ ముఖ్యమంత్రి బాధ్యతలతోపాటు ప్రభుత్వ, సాధారణ పరిపాలన, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అఖిల భారత సర్వీసులు, జిల్లా రెవిన్యూ అధికారులు, పోలీసు, హోం, స్పెషల్ ఇనీషియేటివ్స్, స్పెషల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, దివ్యాంగుల సంక్షేమం శాఖలను నిర్వహిస్తారు. 


మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నవారు... ఎస్ దురైమురుగన్, కేఎన్ నెహ్రూ, ఐ పెరియసామి, కే పోన్ముడి, ఈవీ వేలు, ఎంఆర్‌కే పన్నీర్ సెల్వం, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్, తంగం థెన్నరసు, ఎస్ రఘుపతి, ఎస్ ముత్తుసామి, కేఆర్ పెరియకరుప్పన్, టీఎం అంబరసన్, ఎంపీ సామినాథన్, పీ గీతా జీవన్, అనిత ఎస్ రాధాకృష్ణన్, ఎస్ఆర్ రాజకన్నప్పన్, కే రామచంద్రన్, ఆర్ సక్కరపని, వీ సెంథిల్ బాలాజీ, ఆర్ గాంధీ, మా సుబ్రహ్మణ్యం, పీ మూర్తి, ఎస్ఎస్ శివశంకర్, పీకే శేఖర్ బాబు, పలనివేల్ త్యాగరాజన్, ఎస్ఎం నాజర్, గింజీ కేఎస్ మస్తాన్, అంబిల్ మహేశ్ పొయ్యమోజి, శివ వీ మెయ్యనాథన్, సీవీ గణేశన్, టీ మనో తంగరాజ్, ఎం మతివెంధన్, ఎం కయల్విజి సెల్వరాజ్. వీరు నిర్వహించే శాఖలను కూడా స్టాలిన్ ప్రకటించారు. 


వీరిలో కే పోన్ముడి ఉన్నత విద్యా శాఖ మంత్రిగా, ఎంఆర్‌కే పన్నీర్ సెల్వం వ్యవసాయ మంత్రిగా, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ రెవిన్యూ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారు. 


Advertisement
Advertisement