సమగ్ర దర్యాప్తు చేయండి

ABN , First Publish Date - 2021-01-17T06:02:07+05:30 IST

కొంత మంది అధికారుల వ్యవహార శైలితో పోలీస్‌ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌, ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. టీడీపీ సోషల్‌ మీడియా సభ్యుడు వినోద్‌ అక్రమ

సమగ్ర దర్యాప్తు చేయండి
ఎస్పీ అమిత్‌ బర్దర్‌కు వినతిపత్రం అందిస్తున్న టీడీపీ నాయకులు




ఎస్పీకి టీడీపీ నేతల ఫిర్యాదు

 కొంత మంది అధికారుల వ్యవహార శైలితో పోలీస్‌ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌, ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. టీడీపీ సోషల్‌ మీడియా సభ్యుడు వినోద్‌ అక్రమ అరెస్ట్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ జిల్లా  టీడీపీ నేతలు శనివారం ఎస్పీ అమిత్‌బర్దర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. రవికుమార్‌ మాట్లాడుతూ  పలాస డీఎస్పీ శివరామిరెడ్డి కుల అభిమానంతోనో.. ఇతర కారణాలతోనో సీఎంపై అభిమానం చాటుతున్నారన్నారు. అటువంటిదేమైనా ఉంటే ఇడుపులపాయలో చూసుకోవాలన్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే వేలాది మంది టీడీపీ శ్రేణులతో పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నా చేస్తామన్నారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ మంత్రి అప్పలరాజు చెప్పారన్న కారణంగానే వినోద్‌ను అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని మంత్రి అప్పలరాజు తనకు సవాల్‌ విసిరిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సవాల్‌కు వినోద్‌ స్పందించి ఎంపీ వరకూ ఎందుకు..? తానే పోటీచేస్తానని ప్రతిసవాల్‌ చేశారని చెప్పారు.ఇది మంత్రికి ఆగ్రహం తెప్పించిందని..రౌడీలకు పురమాయించి దాడులు చేయించారని..అక్రమంగా కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. మంత్రి పదవిని అప్పలరాజు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. వినోద్‌కు తెలుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు.  గౌతు శిరీష, పీరికట్ల విఠల్‌ తదితరులు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు.




Updated Date - 2021-01-17T06:02:07+05:30 IST