Abn logo
Jul 23 2021 @ 21:52PM

చిట్టమూరు పీఏసీఎస్‌ను అభివృద్ధి చేస్తా..

మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెలగపల్లి

గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌

చిట్టమూరు, జూలై 23 : చిట్టమూరు పీఏసీఎస్‌ని అభివృద్ధి పథంలో నడిపించి రైతులకు అందాల్సిన పథకాలు సక్రమంగా అందేలా చేస్తామని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చైర్‌పర్సన్‌గా వాకాటి సుబ్రమణ్యం రెడ్డి, సభ్యులుగా బద్దిగ వెంకటరమణయ్య, ఇరుగు రమేష్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీడీవో సురేష్‌బాబు, వైసీపీ నాయకులు దువ్వూరు శేషురెడ్డి, బాబురెడ్డి, వంకా రమణయ్య, మధు, అశ్వినిరెడ్డి, సాయిరెడ్డి, రహమాన్‌, గోపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, లోకేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.