Abn logo
Sep 23 2021 @ 00:55AM

అపరిశుభ్రత ఉంటే జ్వరాలు రావా?


- అసిస్టెంట్‌ డైరెక్టర్‌ త్యాగరాజ్‌ 

అనంతపురం వైద్యం, సెప్టెంబరు22: ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉంది... లార్వా అధికంగా కనిపి స్తోంది... ఇలా ఉంటే దోమలు పెరిగి జ్వరాలు రావా అంటూ వైద్య సిబ్బందిని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ప్రాం తీయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ త్యాగరాజ్‌ ప్రశ్నించారు. ఆయ న బుధవారం జిల్లాకు వచ్చారు. అనంతపురం రూరల్‌ పరిధిలోని ఆకతోటపల్లి, నగరంలోని ప్రకాష్‌రోడ్‌లో పర్య టించారు. ఆయా ప్రాంతాల్లో జ్వరాల బాధితుల వివ రాలపై ఆరా తీశారు. అనేక చోట్ల నీరు నిల్వ ఉండడం తో దోమలు పెరిగి జ్వర బాధితులు అధికమవుతున్నా రని అన్నారు. వెంటనే నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట మలేరియా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.