మహిళల జీవనోపాధికి ‘చేయూత’

ABN , First Publish Date - 2020-08-13T10:02:59+05:30 IST

మహిళల సుస్థిర జీవనోపాధికి వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. బు

మహిళల జీవనోపాధికి ‘చేయూత’

బొబ్బిలి రూరల్‌, ఆగస్టు 12:  మహిళల సుస్థిర జీవనోపాధికి వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ఎంతగానో  దోహదపడుతుందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో చేయూత పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 45 నుంచి 60 ఏళ్ల  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.18,750 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.


నాలుగేళ్లలో రూ.75వేలు ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు.  సుమారు 25 లక్షల మందికు చేయూత అందించను న్నట్లు తెలిపారు. ప్రత్కాధికారి మాలకొండయ్య, ఎంపీడీవో పి.చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.  ఫ రామభద్రపురం: కొట్టక్కిలో మాజీ ఎంపీపీ అప్పికొండ శ్రీరాములునాయుడు కుటుంబాన్ని  ఎమ్మెల్యే శంబంగి  పరామర్శించారు.  అప్పికొండ సతీమణి, జడ్పీటీసీ అభ్యర్థి   సరస్వతి,     కుటుంబ సభ్యులు లక్ష్మునాయుడు, చినబాబు,  లక్ష్మి,  నిర్మల, వైసీపీ నేతలు చొక్కాపు లక్ష్మణరావు, పత్తిగల ఏక్‌నాథ్‌, ముల్లు సాగర్‌, రమణ  పాల్గొన్నారు. 


కొత్తవలస:  కొత్తవలసలో రైతు భరోసా కేంద్రంలో  ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివా సరావు చేయూత పథకాన్ని ప్రారంభించారు. మొదటి విడతగా రూ.32 కోట్ల 60 లక్షలను జమ చేశా మన్నారు. నియోజకవర్గంలో 17,096 మంది మహిళ లు లబ్ధి పొందారన్నారు. ఎస్‌.కోటలో తాగు నీటికి సంబంధించి రూ.100 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. కార్యక్ర మంలో వెలుగు కో-ఆర్డినేటర్‌ జయశ్రీ, వైసీపీ నాయకులు నెక్కలనాయుడుబాబు, ఇందుకూరి రఘురాజు,  అర్జునరావు, జయ ప్రకాష్‌  తదితరులు పాల్గొన్నారు. 


పార్వతీపురం రూరల్‌ : ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు   చేయూత పథకాన్ని ప్రారంభించారు. నియోజక వర్గంలో సుమారు 17,407 మంది మహిళలకు నగదును నేరుగా వారి ఖాతాల్లోకి వేస్తున్నట్లు చెప్పారు. ఎంపీడీవో కృష్ణారావు, మునిసిపల్‌ కమిష నర్‌ కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


సాలూరు రూరల్‌:  స్థానిక వెలుగు మండల సమాఖ్యలో  ఎమ్మెల్యే రాజన్నదొర చేయూత పథకా న్ని ప్రారంభించారు. నియోజక వర్గంలో 15,707 మంది మహిళలకు రూ. 28.51 కోట్లను  అందించామన్నారు.  డీసీసీబీ డైరెక్టర్‌ రెడ్డి సురేష్‌,  వైసీపీ నేతలు డోల బాబ్జీ,  గణపతి, గౌరీష్‌, రాము, వెలుగు ఏపీడీ సావిత్రి, ఎంపీడీవో శివరామప్ప పాల్గొన్నారు.


Updated Date - 2020-08-13T10:02:59+05:30 IST