చెడు వ్యసనాలకు బానిస కావొద్దు

ABN , First Publish Date - 2021-10-25T06:21:48+05:30 IST

విద్యార్థి, యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ కోరారు. హుజూర్‌నగర్‌లోని సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రా, ఒరి స్సా, విశాఖపట్టణం నుంచి సూర్యాపేట జిల్లా

చెడు వ్యసనాలకు బానిస కావొద్దు
పాలకవీడు పోలీస్‌స్టేషన్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ 

హుజూర్‌నగర్‌ , అక్టోబరు 24: విద్యార్థి, యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ కోరారు. హుజూర్‌నగర్‌లోని సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రా, ఒరి స్సా, విశాఖపట్టణం నుంచి సూర్యాపేట జిల్లాకు గంజాయి సరఫరా కావడం తో పాటు బెంగళూరు, ముంబాయి, మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాలకు తర లుతుందన్నారు. జిల్లాలో 30 కేసులు నమోదు చేసి 46మందిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకాలు, కొనుగోళ్లపై ప్రభుత్వం సీరియ్‌సగా వ్యవహరిస్తోందన్నారు. ఆంధ్రా, ఒడిషా సరిహద్దుల నుంచి జిల్లాకు సరఫరా అయ్యే గంజాయిపై నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమ్మకాలు, కొనుగోలుచేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూర్యాపేటను గంజాయి రహితంగా మార్చేందుకు అంద రూ సహకరించాలన్నారు. యువత నిర్వీర్యం కావద్దన్నారు. యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎక్కడ ఎలాంటి సమాచారం తెలిసినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి అధికంగా సేవించే ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. పట్టణాల నుంచి పల్లెలకు గంజాయి వెళ్తోందన్నారు. ప్రతి గ్రామంలో కొంతమంది యువకులు గంజా యి సేవిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, యువతపై దృష్టిసారించాలన్నారు. గంజాయికి బానిసైన వ్యక్తులను రిమాండ్‌ చేస్తామని హెచ్చరించారు. ప్రాథమిక దశలో ఉన్న వ్యక్తులకు కౌన్సిలింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి మత్తులో ఎలాంటి ప్రమాదాలకు పాల్పడతారో తెలియని పరిస్థితిలో ఉంటారన్నారు. అలాంటి వ్యక్తుల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నందున డీజీపీ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేస్తున్నామన్నారు. సమావేశంలో డీఎస్పీ రఘు, రామలింగారెడ్డి, వెంకటరెడ్డి, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

గంజాయి నిర్మూలనకు కృషి చేయాలి 

నేరేడుచర్ల: గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. గంజాయి నిర్మూలనకు పాత్రికేయులు, విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యులు కావాలన్నారు. సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. యువత మత్తు పదార్థాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారన్నారు. యువత గంజాయి వల్ల నిర్వీర్యం అవుతున్నారని, డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ప్రతి పోలీ్‌సస్టేషన్‌లో కింది స్థాయి సిబ్బందిని కూడా చైతన్యం చేసేందుకు ప్రతి పోలీ్‌సస్టేషన్‌ను సందర్శిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ రఘు, సీఐ రామలింగారెడ్డి తదితరులున్నారు.

పాలకవీడు పోలీస్‌స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ 

పాలకవీడు: పాలకవీడు పోలీ్‌సస్టేషన్‌ను ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ఆదివా రం రాత్రి తనిఖీ చేశారు. గంజాయి రహిత జిల్లా కోసం అందరూ పనిచేయాలన్నారు. సరిహద్దు పోలీ్‌సస్టేషన్‌ అయినందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.కార్యక్రమంలో డీఎస్పీ రఘు, సీఐ రామలింగారెడ్డి, ఎస్‌ఐ సైదులు ఉన్నారు. 

Updated Date - 2021-10-25T06:21:48+05:30 IST